KTR Letter to PM Modi: మీ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది..ఆవో దేఖో సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖాస్త్రం..!
KTR Letter to PM Modi: తెలంగాణకు బీజేపీ పెద్దల రాకతో పాలిటిక్స్ వేడెక్కాయి. టీఆర్ఎస్ నేతలు, కమలనాథుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
KTR Letter to PM Modi: తెలంగాణకు బీజేపీ పెద్దల రాకతో పాలిటిక్స్ వేడెక్కాయి. టీఆర్ఎస్ నేతలు, కమలనాథుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈక్రమంలో ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. ప్రధాని మోదీ గారు..తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండని.. ఆవో దేఖో సీకో(Aao-Dhekho-Seekho) అంటూ విమర్శలు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి చర్చించుకోండని అన్నారు.
బీజేపీ డీఎన్‌ఏలోనే విద్వేషం, సంకుచిత్వం ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలకు పనికొచ్చే విషయాలపై సమావేశాల్లో చర్చించుకోవాలని హితవు పలికారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయి మీకు లేదంటూ లేఖలో విమర్శించారు. హైదరాబాద్‌లో జరగబోయే పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషమేనని మండిపడ్డారు. ఈవిషయం అందరికీ తెలుసు అని చెప్పారు.
అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న బీజేపీకి ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ నేతల తీరు మారడానికి తెలంగాణే మంచి ప్రదేశమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, పథకాలు, సుపరిపాలన విధానాలపై అధ్యయనం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్‌తో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. పోరుగడ్డ అయిన తెలంగాణ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకాలన్నారు మంత్రి కేటీఆర్.
Also read: Nupur Sharma: నుపుర్ శర్మ అభ్యర్థనకు నో..క్షమాపణ చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ..!
Also read: Rupee To Dollar: ఆల్ టైమ్ కనిష్ఠానికి భారతీయ కరెన్సీ..దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook