Special Website For Sammakka Joggery Donation: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా పాలన అందిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతరకు వైభంగా ఏర్పాటు కొనసాగుతున్నాయి. జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ఉన్నాతధాకారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ క్రమంలోనే అమ్మవారి గద్దెల దగ్గర భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తుంటారు. తమమనస్సులోని కోరికలు నెరవేరితే, బంగారం సమర్పిస్తామని మొక్కులు మొక్కుకుంటారు. చాలా వరకు భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కానీ కొందరు మాత్రం కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోవచ్చు. కానీ ఇలాంటి వారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది.


మీ సేవ ద్వారా జాతరలో బరువుకు తూగే బెల్లం ధరను మీ సేవ ద్వారా చెల్లించే అవకాశం  కల్పించింది. ఈ మేరకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఈ సేవలను సచివాలయంలో తన కార్యాలయంలో ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి సురేఖ పొందారు. వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.


ఐటి శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మీ సేవ (ఆన్లైన్, ఆఫ్ లైన్), టి యాప్ ఫోలియో (ఆన్లైన్), పోస్టల్ డిపార్ట్మెంట్ల (ఆఫ్ లైన్) ద్వారా ఎవరి పేరు మీదైతే  బంగారం సమర్పించాలనుకుంటున్నారో వారి బరువును అనుసరించి డబ్బులు చెల్లించి ఈ సేవలను బుక్ చేసుకునే వెసులుబాటును దేవాదాయ శాఖ అందిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీ సేవా సెంటర్లు,  దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు (తెలంగాణలో 6 వేల కేంద్రాలు) ఈ సేవలను అందిస్తాయి.


దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుంది. బంగారం సమర్పణతో పాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా  డబ్బులు చెల్లించినట్లైతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, పోస్టల్ డిపార్ట్ మెంట్, మీ సేవ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Read More: Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్‌ !


Read More: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook