Foods To Eat During Fever: శీతాకాలంలో చాలా మంది జ్వరం, దగ్గు వంటి సమస్యల బారిన పడుతుంటారు. దీని వల్ల శరీరం నీరసంగా, అలసటగా ఉంటుంది. మరికొంతమంది తరుచు జ్వరం సమస్యతో బాధపడుతుంటారు. దీని కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. మన రోజు తీసుకొనే ఆహారంలో మార్పులు జరగడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జ్వరం నుంచి బయటపడటానికి చాలా మంది హాస్పిటల్‌కు, మెడిసిన్లు వాడుతుంటారు. అయితే వాటితోపాటు ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే కొన్ని నేచురల్ పదార్థాలను వాడటం వల్ల సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద ప్రకారం కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల జ్వరం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అందులో తేనె తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయిని అంటున్నారు. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులైన వెంటనే తగ్గిపోతాయి. శరీరంలోని సూక్ష్మక్రిములను నాశనం చేయడంలో తేనె ఎంతో ప్రభావింతంగా ఉంటుంది. తేనె గాయాలు, పుండ్ల వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తేనెలో ఉండే లక్షణాలు ఇన్‌ఫెక్షన్‌లను త్వరగా తగ్గడంలో సహాయపడుతాయి. దీనిని జ్వరంతో బాధపడుతున్న వారికి ఇవ్వడం వల్ల త్వరగా సమస్య నుంచి బయటపడుతారు. దీనిని నేరుగా తీసుకోవచ్చు.
వెల్లుల్లి తీసుకోవడం వల్ల జ్వరం తగ్గుతంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్‌ఫెక్షన్‌ల నుంచి పోరాడంలో సహాయపడుతుంది. దీనిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. హానికరమైన బాక్టీరియాను తొలగించడంలో ఎంతో ప్రభావింతం చేస్తుంది. వెల్లుల్లితో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వెల్లుల్లి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా తప్పకుండా వెల్లుల్లిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.
అల్లంలో ఎన్నో సహజ సిద్దమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల జ్వరం సమస్య తగ్గుతుంది. అలాగే అల్లంలో ఉండే జింజెరాల్ అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కండరాల నొప్పులను, ఇన్‌ఫెక్షన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే కర్‌క్యుమిన్ పదార్థం సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది.
Also Read: Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter