Telangana Night Curfew Update: తెలంగాణలో త్వరలోనే నైట్ కర్ఫ్యూ విధించనున్నారనే వార్తలపై రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డి.శ్రీనివాసరావు స్పందించారు. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంతటి కరోనా తీవ్రత లేదని అన్నారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే.. ఆ పరిస్థితుల్లో నైట్ కర్ఫ్యూ అవసరమని తెలియజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 3.16 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఆ 10 శాతం పాజిటివిటీ రేటు మించలేదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 


జీహెచ్ఎంసీ పరిధిలో 4.26 కరోనా పాజిటివిటీ రేటు ఉండగా.. మేడ్చల్ లో 4.22 శాతం,  మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతంగా ఉందని తెలంగాణ డీహెచ్ డి.శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. 


రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 61 శాతంగా అందుబాటులో ఉండడం సహా వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని డి.శ్రీనివాసరావు అన్నారు. ఇంటింటికి జ్వరం సర్వేతో పాటు లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అయితే నేడు (జనవరి 25) రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీని కోసం వైద్యారోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది.  


ALso Read: Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థల రీఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ


Also Read: Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,603 కొవిడ్ కేసులు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి