Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థల రీఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థలను పునఃప్రారంభంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి 30 తేదీన ఇదే విషయమై ప్రకటన చేస్తామని ఆమె స్పష్టం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 09:30 AM IST
    • తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్ పై మంత్రి సబిత క్లారిటీ
    • జనవరి 30 పునఃప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
    • ఇప్పటికే 8 నుంచి ఆపై తరగతుల వారికి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తునట్లు స్పష్టం
Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థల రీఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

Telangana Schools Reopen: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవు రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ సెలవులు ప్రకటించే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి కేసీఆర్ సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఇటీవలే ప్రచారం జరుగుతోంది. 

గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 8, 9, 10 తరగుతుల వారికి ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

కానీ, త్వరలోనే పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. 50 శాతం మంది టీచర్లతో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. సోమవారం నుంచే (జనవరి 24) పాఠశాలలు తిరిగి తెరుస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 

విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సెలవులు పొడిగించాలా? లేదా జనవరి 30 తర్వాత విద్యాసంస్థలు తెరవాలా అనేది ఈ నెల 30 నాటి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామన్నారు.

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు కోసం అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు నష్టపోకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారని.. విద్యార్థులకు టీశాట్ ద్వారా తరగతులు బోధించాలని నిర్ణయించినట్లు సమాచారం.  

Also Read: Mulugu Siddanthi: ప్రముఖ పంచాగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం!

Also Read: Student appeals to KCR: 'సీఎం సార్ నేను చనిపోతా అనుమతివ్వండి ప్లీజ్'​.. అంటూ విద్యార్థి విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News