Telangana Students and unemployees milk Anointing to CM KCR Photos: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు ఈరోజే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. దాంతో రాష్ట్రంలోని యువత,నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. యువత, నిరుద్యోగులు సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఓయూలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పెద్దగా కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఓయూ రోడ్లపై పరుగులు తీస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ యువత, నిరుద్యోగులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి పాలాభిషేకం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మండల ప్రజాప్రతినిధులు మరియు నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో యువత హాజరైంది. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదానాలు చేశారు. 


జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో రాష్రం సుభిక్షంగా ఉండబోతుందని టీఆర్ఎస్ నాయకులు అన్నారు.


Also Read: Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారిగా ఖాళీ వివరాలు ఇవే! అత్యధికంగా హైదరాబాద్‌లో!!


Also Read: Coal Mine Accident: సింగరేణిలో విషాదం.. అడ్రియాల్‌ గనిలో రూప్ వాల్ కూలి ముగ్గురు మృతి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook