House To House Survey: ప్రజల వివరాలు సేకరించడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అస్తవ్యస్తంగా సాగుతుండగా.. అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దాదాపు పక్షం రోజులు అవుతుండగా సర్వే మాత్రం పూర్తిస్థాయిలో సాగడం లేదు. సర్వే ప్రారంభమై 12 రోజులు ముగిసినా కూడా 60 శాతం కూడా పూర్తి కాలేదు. సర్వేకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. సర్వేలో వ్యక్తిగత వివరాలు సేకరిస్తుండడం వంటివి తీవ్ర దుమారం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్‌.. అభివృద్ధిలో తగ్గేదేలే!


 


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల  సర్వే 2024 చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే విజయవంతంగా కొనసాగుతోందని ప్రకటించింది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశం దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొంది. నవంబర్ 6వ తేదీనన ప్రారంభమైన ఈ సర్వే 12 రోజులు ముగియగా ఇప్పటివరకు సగానికి పూర్తయిందని వెల్లడించింది. ఆదివారం నవంబర్ 17వ తేదీ నాటికి ఇంటింటి సర్వే 58.3 శాతానికి పూర్తయ్యింది.

Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్


 


సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించగా.. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది. అనంతరం చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు  67,72,246 గృహాల సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది.


నవంబర్ 17వ తేదీ నాటికి సర్వే పూర్తయిన ఇళ్లు
గ్రామీణం: 64,41,183
పట్టణం: 51,73,166
మొత్తం: 1,16,14,349


బ్లాకులు
గ్రామీణం: 52,493
పట్టణం: 40,408
మొత్తం: 92,901


ఎన్యుమరేటర్లు
గ్రామీణం: 47,561
పట్టణం: 40,246
మొత్తం: 87,807


పర్యవేక్షకులు
గ్రామీణం: 4,947
పట్టణం: 3,841
మొత్తం: 8,788


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter