Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?
Telangana Thalli Statue Vandalise With Bulldozer In Devaruppula: దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బుల్డొజర్ సంస్కృతి తెలంగాణకు కూడా పాకినట్టు కనిపిస్తోంది. మొన్న ఏపీ.. ఇప్పుడు తెలంగాణలో జేసీబీలు రంగంలోకి దిగాయి.
Telangana Thalli Statue: దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించాయి.. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ బుల్డోజర్లు కనిపించనున్నట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నల్గొండలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రొక్లెయిన్‌తో కూల్చివేశారు. రాజకీయాలకు సంబంధం లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో పది రోజుల కిందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటుచేసుకున్నారు. ఇంకా విగ్రహ ఆవిష్కరణ కూడా జరగనట్టు కూడా కనిపిస్తోంది. అయితే విగ్రహ ఏర్పాటును సహించలేని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విగ్రహానికి అనుమతి లేదంటూ పోలీసులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చడానికి రంగంలోకి దిగారు.
Also Read: BRS Party MLAs: ఎంపీ కె కేశవరావు రాజీనామాతో 6 మంది ఎమ్మెల్యేలకు పదవీ గండం?
గ్రామంలో ఉద్రిక్తత
పోలీసు పహారా మధ్య గురువారం జేసీబీని తెప్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. విగ్రహం దిమ్మెపైకి ఎక్కిన వారిని కిందకు దింపేశారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుచేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమిటి? అభ్యంతరం అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన విగ్రహం కాదని గ్రామస్తులు చెప్పారు. అయినా కూడా వినకుండా అధికారులు విగ్రహం తొలగించడానికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విగ్రహ ఏర్పాటు వివాదం కామారెడ్డిగూడెంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసు అధికారులు, పంచాయతీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter