Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆలోచన లేదని స్పష్టం చేసిన మంత్రి
Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. అదనంగా నాలుగు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. అదనంగా నాలుగు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
కరోనా సెకండ్ వేవ్(Corona second wave)దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రేవేటు మెడికల్ కళాశాలల యజమానులతో ఇప్పటికే ఆయన భేటీ అయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని..తెలంగాణకు ఆ రాష్ట్రం నుంచి వచ్చిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మహారాష్ట్ర (Maharashtra) ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుందన్నారు.
అయితే కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని..లాక్‌డౌన్(Lockdown), కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని మంత్రి ఈటెల రాజేందర్ (Etela Rajender) చెప్పారు. కరోనా చికిత్స కోసం మెడికల్ కళాశాలల్లో సాధారణ బెడ్స్‌తో పాటు ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు సిద్దం చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే నాలుగు కోవిడ్ సెంటర్లు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. వీటి కోసం 179 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాల, నిజామియా టీబీ ఆసుప్రి, సరోజిని దేవి ఆసుపత్రుల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Also read: COVID-19 cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook