Telangana Weather Today: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. ఈదురుగాలులు కూడా!
Telangana Weather Forecast. తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Moderate rains to hit Telangana for next 2 days: నైరుతి రుతుపవనాలు సోమవారం (మే 16) అండమాన్, నికోబార్ దీవుల వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రానున్న 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల వైపు రుతుపవనాలు దూసుకెళ్లనున్నాయి. అలానే అండమాన్ ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. మే చివరి నాటికి కేరళ తీరానికి, జూన్ 8 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకస్మాత్తుగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడంతోనే వేసవిలో అకాల వర్షాలు కురుస్తున్నాయట.
ఆదివారం రాత్రి 8 నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకూ తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీబీపేట (కామారెడ్డి) లో 8.8, చిన్నశంకరంపేట (మెదక్ జిల్లా)లో 8.2, పైడ (నిజామాబాద్)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంతకన్నా తక్కువ స్థాయిలో వాన కురిసింది. మరోవైపు సోమవారం రాష్ట్రంలోక అత్యధికంగా మణుగూరు (భద్రాద్రి జిల్లా)లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే!
Also Read: Horoscope Today May 17 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook