Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపుఓ మోస్తరు వర్షాలు!
Rains in Telangana for more two days. సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Rains in Telangana for more two days: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని కూడా పేర్కొంది.
ఆదివారం (జూన్ 26) ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న జిల్లాలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురవగా.. సిద్దిపేట జిల్లా కోహెడలో 4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరోవైపు మల్యాల (కరీంనగర్)లో 4, టేక్మాలు (మెదక్)లో 4 సెంటీమీటర్ల వర్షం నమోదవ్వగా.. అశ్వాపురం (భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాల రాకతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఇక ఆదివారం అత్యధికంగా ఖమ్మంలోని కారేపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాల కారణంగా మరో రెండు రోజులు కూడా వాతావరణం చల్లగా ఉండనుంది.
Also Read: IRE vs IND 1st T20: హుడా మెరుపు ఇన్నింగ్స్.. ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం!
Also Read: Horoscope Today June 27 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల విద్యార్థులకు శుభకాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి