Telangana Weather: తెలంగాణలో చలి గాలులు ప్రతాపం పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. సంక్రాంతి వరకూ చలి తీవ్రత తగ్గే సూచనలు కన్పించడం లేదు. ముఖ్యంగా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో కూడా కనిష్ట ఉష్ణోగ్రత అంతకంతకూ తగ్గుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలిగాలులు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు కనిష్టంగా సింగిల్ డిజిట్‌కు చేరాయి. అదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీలకు చేరింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత కేవలం 17.1 డిగ్రీలే నమోదైంది. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఓ వైపు హెచ్ఎంపీవీ వైరస్ భయపెడుతున్న క్రమంలో చలి తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు, చిన్నారులు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. 


తెలంగాణలోని పలు జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. రానున్న వారం రోజులు అదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలితీవ్రత పెరగనుంది. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా కనీస ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలు నమోదైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ నగరంలో మేఘాలు ఆవరించి ఉంటాయి. రేపు కూడా కనీస ఉష్ణోగ్రత 16.3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే గురువారం వరకూ కనీష ఉష్ణోగ్రత 18 డిగ్రీలు దాటే పరిస్థితి లేదు. 


ఇక నిన్న నల్గొండల 16 డిగ్రీలు, ఖమ్మంలో 16, హయత్ నగర్‌లో 14, హైదరాబాద్‌లో 13.6 డిగ్రీలు, హకీమ్ పేట్‌లో 13.3 డిగ్రీలు, నిజామాబాద్‌‌లో 13.4 డిగ్రీలు, భద్రాచలంలో 16.5 డిగ్రీలు హన్మకొండలో 11.5 డిగ్రీలు, మెదక్‌లో 11.3 డిగ్రీలు, రామగుండంలో 10.6 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 10.5 డిగ్రీలు నమోదు కాగా పఠాన్ చెరువులో అత్యల్పంగా 9.6 డిగ్రీలు నమోదైంది. 


Also read: Ys Jagan on Tirupati Stampede: తొక్కిసలాట బాధితులకు జగన్ పరామర్శ, పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన ఆసుపత్రికి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.