Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. నిన్న అగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని సంచాలకులు వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందన్నారు. ఈ అల్పపీడనం ఇంచుమించు పశ్చిమదిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌- ఉత్తర తమిళనాడు తీరం వద్ద దానిని అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈనెల 18న చేరే అవకాశం ఉందని తెలిపారు. 


Also Read: Warangal: వరంగల్‌లో పట్టపగలే చోరీ.. సినిమా స్టైల్‌లో డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు


Also Read: Bandi Sanjay: బండి సంజయ్ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత... ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న టీఆర్ఎస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook