Rain Alert: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తీవ్రమైన వడగాల్పుల కారణంగా జనం విలవిల్లాడుతున్నారు. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండల వేడిమి నుంచి రిలీఫ్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు నెలరోజులుగా గతంలో ఎన్నడూ నేనంతగా అధిక ఉష్ణోగ్రతలతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వాతావరణం వేడెక్కపోయింది. ఓ వైపు భారీ ఉష్ణోగ్రతలు మరోవైపు తీవ్రమైన వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడుతుందని ఐఎండీ శుభవార్త అందించింది. రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడ్రోజులు అంటే మే 9 వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు, వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. 


వర్షాల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు తగ్గిపోతుందని ఐఎండీ వివరించింది. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో వర్షం పడటంతో కొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. అటు సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అయితే చిన్న చిన్న పూరిళ్లపైకప్పులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఆయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు బెంబేలెత్తించాయి. జగిత్యాలలో అత్యధికంగా 47.1 డిగ్రీలు నమోదైంది. 


జగిత్యాల జిల్లాలోని గోధూరులో 46.8 డిగ్రీలు, అల్లీపూర్‌లో 46.7 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలో 46.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 43.8 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాలలో 46 డిగ్రీలు నమోదైంది. 


Also read: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook