Bhuvanagiri Girls Sucide Mystery: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హస్టల్ లో శనివారం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన సంఘటన తెలిసిందే. పదోతరగతి చదువున్న భవ్య, హస్టల్ విద్యార్థినులు రూమ్ లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు హస్టల్ నిర్వాహకులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Rock Salt: కళ్ళు ఉప్పు గురిచి మీరు అసలు నమ్మలేని నిజాలు ఇవే!


బాలికలను టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో బాలికల శరీరంపై గాయాలు ఉండటం బైటపడింది. చేతులు, కాళ్లపై కొరికిన గాయాలు, వీపు భాగంలో కొట్టిన వాతాలు కూడా కన్పించాయి. ఈ ఘటనపై ఆదివారం విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. తమ కూతురిని హత్యల్ సిబ్బంది హత్య చేసి, ఆత్మహత్యలుగా చిత్రీకరించారని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


హస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచన, పీఈటీ ప్రతిభ, ట్యూషన్ టీచర్ భువనేశ్వరీ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. హస్టల్ వార్డెన్,  ఓ ఆటో డ్రైవర్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అది కాస్త భవ్య, వైష్ణవి కంట పడటంతో వేధించి, ఇలా హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


Read More: Nagarjuna100: నాగ్100 కోసం భారీకసరత్తులు..పాన్ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న దర్శకుడు


బాలికలు దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో మాత్రం మరింత ట్విస్ట్ లు ఉన్నాయి. దానిలో హస్టల్ వార్డెన్ లను పొగుడుతూ, లెటర్ రాసినట్లు సమాచారం. వార్డెన్ పాడుపనులు బైటకు రావడంతో ఎక్కడ పిల్లలు అందరికి చెప్తారో అని ఇలా చేశారని కూడా బాలికల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన యాదాద్రి జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook