Akkineni Nagarjuna: గత కొద్ది కాలంగా సరైన హీట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అందగాడు నాగార్జున..ఖాతాలో ఈ సంక్రాంతికి విడుదలైన నా సామి రంగ మంచి సక్సెస్ ను ఇచ్చింది. చెప్పుకో తగినంత పెద్ద సక్సెస్ కాకపోయినా.. మంచి టాక్ సొంతం చేసుకొని ..డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది నా సామిరంగా మూవీ. సంక్రాంతి సీజన్ లో పోటీ ఉన్నప్పటికీ ఈ మూవీ బాగానే నిలబడింది. దీంతో నాగార్జున ఎంతో ఉత్సాహంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కాన్సెంట్రేట్ చేస్తున్నాడు.
ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి డైరెక్టర్ గా
శేఖర్ కమ్ముల దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో హీరో పాత్రకు దీటుగా ఉండే పాత్రలో నాగార్జున నటిస్తున్నాడని టాక్. ఇక రీసెంట్ గా జరిగిన నా సామిరంగా సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని ఇన్ డైరెక్ట్ గా నెక్స్ట్ సీజన్ కూడా సంక్రాంతికి సినిమాతో వస్తానని చెప్పకనే చెప్పాడు. వచ్చే సంక్రాంతికి తనకు బాగా సెట్ అయ్యే విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలి అని నాగార్జున భావిస్తున్నాడట. మరి ఆ మూవీ బంగార్రాజుకు సీక్వెలా లేక మరో కొత్త కథతో వస్తాడా చూడాలి.
వీటితో పాటుగా నాగార్జున తన వందవ సినిమా మైలురాయిపై కూడా పూర్తి ఫోకస్ పెట్టాడు అని వినికిడి. ఈ ప్రాజెక్టుకి దర్శకుడిగా రాజాను అనుకున్నప్పటికీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. మరోపక్క కోలీవుడ్ లో యూత్ డైరెక్టర్ నవీన్ ను నాగ్ సంప్రదించారట.. కథ కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి.‘మూడర్ కూడం’అనే తమిళ్ సినిమాను తెరకెక్కించిన నవీన్ డైరెక్షన్.. నచ్చిన నాగ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అతన్ని అప్రోచ్ అయ్యారు.
ఇటు నాగార్జున కు సెట్ అయ్యే విధంగా నవీన్ ఓ భారీ కథను రెడీ చేశాడు అని టాక్. అంతేకాదు ఈ మూవీని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని నవీన్ అలానే నాగర్జున భావిస్తున్నారట. తమిళ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని త్వరలో నాగ్ 100 వ మూవీ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
నాగ్100 కోసం భారీకసరత్తులు..పాన్ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న దర్శకుడు