సత్తా చాటిన `తెలంగాణ బిర్యాని`
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గిరిజన ఉత్సవం (ఆది మహోత్సవ్) పోటీల్లో తెలంగాణ తరఫున ఉత్తమ వంటకాల విభాగంలో పోటీ పడిన `బంజారా బిర్యానీ` మొదటి బహుమతిని గెలుచుకుంది.
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గిరిజన ఉత్సవం (ఆది మహోత్సవ్) పోటీల్లో తెలంగాణ తరఫున ఉత్తమ వంటకాల విభాగంలో పోటీ పడిన "బంజారా బిర్యానీ" మొదటి బహుమతిని గెలుచుకుంది. రెండవ, మూడవ స్థానాల్లో తమిళనాడు, ఒడిశా వంటకాలకు చోటు దక్కింది. ప్రతీ సంవత్సరం గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి ఉత్సవమే "ఆది మహోత్సవ్". ఇందులో గిరిజన సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులు, వంటకాలు, కళారూపాలను ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే ఉత్తమమైన వాటికి బహుమతులు కూడా అందిస్తారు. ఇటీవలే 2017 సంవత్సరానికి సంబంధించి ఈ ఉత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ ప్రారంభించారు. దాదాపు 200 స్టాల్స్ ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 500 పైగా గిరిజన కళాకారులు, వర్తకులు ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు.