Telangana’s floral festival Bathukamma screened on Burj Khalifa : తెలంగాణకే తలమానికమైన పూల పండుగ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలంగాణ (Telangana) సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha). దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై (Dubai’s Burj Khalifa) బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ(Bathukamma) గొప్పతనాన్ని చాటి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) తెరపై రెండు సార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది బతుకమ్మ పండుగ వీడియోలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.



 


Also Read : Amit Shah : క‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌ర‌ణ - అమిత్‌షా


ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించారు. ఇవ్వాల దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను (Bathukamma) ప్రదర్శించడంతో తెలంగాణ పూల పండుగ మరోసారి మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవిదేశాలకు చెందిన లక్షల మంది ఒకేసారి బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa) స్క్రీన్‌ పై బతుకమ్మను వీక్షించారు.



 


Also Read : Koozhangal Oscar entry: ఆస్కార్‌ బరిలో నయతారకు కాబోయే భర్త మూవీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook