Tequila Pub: రాడిసన్ బ్లూ పబ్ కేసు తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. అయినా పబ్ ల వ్యవహారం మారలేదు. ఎప్పటిలానే నిబంధనలకు విరుద్దంగా పబ్ లు కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని టకీల పబ్ లో అక్రమ బాగోతం బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. టకీల పబ్‌ వ్యవహారంలో కఠిన చర్యలకు దిగారు. రాంగోపాల్ పేట్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సీఐని సీపీ ఆఫీస్‌ కు అటాచ్‌ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. రాంగోపాల్‌ పేట్‌ SHO ఇంచార్జ్‌ గా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ను నియమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే సీఐను సస్పెండ్ చేశారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాంగోపాల్ పేటలోని టకీలా పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సమయం దాటినా పబ్‌లో పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. లోపల జరుగుతున్న తతంగం చూసి పోలీసులు షాకయ్యారు. యువతి, యువకులు డీజే సాంగ్స్ కు డ్యాన్సులు చేస్తున్నారు. దీంతో అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్న 18 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పబ్ ను సీజ్ చేశారు. పబ్ లో దొరికిన వాళ్లలో 8 మంది డ్యాన్స్ గర్ల్స్, 8మంది కస్టమర్లు ఉన్నారు. డీజే అపరేటర్ తో పాటు పబ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి తీసుకుని టకీలా పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 294, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు 41 CRPC నోటీసులు ఇచ్చి వదిలేశారు. గతంలోనూ టకీల బార్ అండ్ రెస్టారెంట్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ లోని పబ్బుల నిర్వహణపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పబ్బులు అసాంఘిక శక్తులకు కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. గడువు దాటిన తర్వాత కూడా పబ్బులు తెరిచే ఉంటున్నాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న బంజారాహిల్స్ లో వెలుగుచూసిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహరంలో సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ కేసులో 150 మందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు దాడులు చేశారు. రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాని పోలీసుల హెచ్చరికలను పబ్ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తాజాగా రాంగోపాల్ పేట టకీలా పబ్ వ్యవహారం బయటపడటంతో మరోసారి హైదరాబాద్ లోని పబ్బుల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నాయి.


READ ALSO: India Corona Cases: కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే?


READ ALSO:  Malla Reedy On Revanth Reddy: రేవంత్ రెడ్డి గూండాలే నన్ను చంపాలని చూశారు.. మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook