TSPSC Group-1 Mains Exam Schedule: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన జారీ చేసింది. ఇటీవల గ్రూపు 1 ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ ముగియడంతో మెయిన్స్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం టీజీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amit Shah Tamilisai: మాజీ గవర్నర్‌ తమిళిసైకి అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్‌.. అతడి విషయంపైనేనా?


గతేడాది కేసీఆర్‌ ప్రభుత్వం విడుదల చేసిన 783 గ్రూపు 1 ఉద్యోగాల ప్రకటనను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసి ఈనెల 9వ తేదీన ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మెయిన్స్ కు సంబంధించిన పరీక్షలకు కమిషన్‌ తేదీలు ప్రకటించింది. వారం రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో ఈ పరీక్షలు ఉంటాయి. ప్రతి పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య జరగనున్నాయి.

Also Read: Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదు


మెయిన్స్ షెడ్యూల్‌ ఇదే


తేదీ                             పేపర్‌
అక్టోబర్‌ 21         జనరల్‌ ఇంగ్లీష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)
22 పేపర్‌ 1         (జనరల్‌ ఎస్సే)
23 పేపర్‌ 2         (హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ)
23 పేపర్‌ 2         (ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం అండ్‌ గవర్నెన్స్‌)
24 పేపర్‌ 3         (ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌)
25 పేపర్‌ 4         (జనరల్‌ ఎస్సే)
26 పేపర్‌ 5         (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌)
27 పేపర్‌ 6         (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)


త్వరలో ఫలితాలు
ఈనెల 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్‌కు సంబంధించిన ఫలితాలను త్వరలోనే టీజీపీఎస్‌సీ విడుదల చేయనుంది. 895 కేంద్రాల్లో ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షli 3.02 లక్షల మంది అభ్యర్థులు రాశారు. త్వరలోనే కీ, ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్‌ కసరత్తు చేస్తోంది. గతంలో అనేక లోపాలు, విమర్శలు తలెత్తడంతో ఇప్పుడు అలాంటివి చోటుచేసుకోకుండా పటిష్టంగా పరీక్షలు, ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook