tgrtc md sajjanar introduces digital payment details: సాధారణంగా మనం బస్సు ఎక్కగానే కొన్ని టికెట్ కు సరిపడ చిల్లర ఇవ్వాలని కండక్టర్ లను చెప్తుంటారు. కానీ చాలా మంది టికెట్ కు సరిపడ టికెట్ లను అస్సలు తమ దగ్గర పెట్టుకోరు. అంతేకాకుండా.. చిల్లర ఇవ్వలేదని, కండక్టర్ తో గొడవలు పడ్డ సంఘటనలు కొకొల్లలు. మరికొందరైతే.. ఒక్కరూపాయి, రెండు రూపాలను సైతం అస్సలు వదులుకోరు. అలాగని తమ దగ్గర ప్రాపర్ గా చిల్లర కూడా మెయింటెన్ చేయరు. దీని వల్ల తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈ పంచాయతీలు చాలా సార్లు పోలీసు స్టేషన్ ల వరకు కూడా వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఇక దేశంలో ప్రస్తుతం డిజిటల్ విప్లవం నడుస్తోంది. నగరు రహిత లావాదేవీలను ఎక్కువగా జరుపుతున్నారు. బ్యాంక్ ల నుంచి పడితే.. వీరి వ్యాపారుల వరకు అందరు తమతో స్కాన్ కోడ్ ను రెడీగా పెట్టుకుంటున్నారు. దాదాపు అందరు కూడా డిజిటల్ పెమెంట్ లపై వైపు మొగ్గుచూపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


ఇదిలా ఉండగా..తెలంగాణ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎండీ సజ్జనార్ ప్రజలు గుడ్ న్యూస్ చెప్పారని భావించవచ్చు. పల్లె, సిటీ బస్సుల్లో నగదురహిత చెల్లింపుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు కల్లా సిటీలోని అన్ని బస్సులలో,  సెప్టెంబరు వరకు తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో  కూడా డిజిటల్ చెల్లింపుల దిశగా ఐ-టిమ్స్ లను ప్రవేశ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల చాలా చోట్ల కండక్టర్ లకు ఈ చిల్లల తలనొప్పి పోవడంతో పాటు, వాగ్వాదాలు కూడా జరగటానికి అవకాశం ఉండదని తెలుస్తోంది.


కొందరు కావాలని కూడా చిల్లర ఇవ్వకుండా వేధిస్తుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ విధానం ప్రవేశ పెడితే.. అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా.. టీజీఆర్టీసీ బస్సుల ద్వారా.. ప్రతిరోజు 50 లక్షలకు పైగా జనాలు తమ గమ్య స్థానాలకు చేరుకుంటు ఉంటారు.  సాధారణ టిమ్ లు కాకుండా.. కొత్తగా  ఐ-టిమ్స్ తో.. డెబిట్ కార్టు, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసే విధంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి అయితే..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా బస్సుప్రయాణాలు చేస్తున్నారు.


Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..


దీని కోసం ఆధార్ కార్డును చెక్ చేస్తున్నారు. తొందరలోనే మహిళలకు.. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు టీజీఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు.. ఇప్పటికే.. హైదరాబాద్ లో పైలేట్ గా... దిల్ సుఖ్ నగర్ సిటీ బస్సులకు ఐ-టిమ్స్ లు,  బండ్లగూడ డిపోకు 74 బస్సులకు 150 టిమ్స్ లు ఇచ్చారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు ఇప్పటికే వాడకంలో ఉన్నాయి.. ఒక్కొ టిమ్ కు (రూ. 9,200 అదనంగా జీఎస్టీ) కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి