TGSRTC Spl Buses: సంక్రాంతి పండక్కి హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ ప్రాంత వాసులు సొంతూళ్లు వెళ్లడానికి  TGSRTC అన్ని విధాలా రెడీ అవుతోంది.  పండుగకు సొంతూర్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్  సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడపాలని ప్లాన్  చేయగా.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 5,246 బస్సులను నడిపింది. గత అనుభవం దృష్ట్యా ఈసారి బస్సుల సంఖ్యను 6,432కు పెంచింది. ఈనెల 9 నుంచి 15 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జేబీఎస్‌‌‌‌‌‌‌‌, ఉప్పల్‌‌‌‌‌‌‌‌  క్రాస్‌‌‌‌‌‌‌‌ రోడ్స్‌‌‌‌‌‌‌‌, ఆరాంఘర్‌‌‌‌‌‌‌‌, ఎల్బీ నగర్‌‌‌‌‌‌‌‌  క్రాస్‌‌‌‌‌‌‌‌  రోడ్స్‌‌‌‌‌‌‌‌, కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ, బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఊర్లకు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది.


అలాగే, హైదరాబాద్  నుంచి ఆంధ్రప్రదేశ్ కూ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, అమలాపురం, కాకినాడ, కందుకూరు,  ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి.


తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్  నుంచి తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్  నుంచి ఎలక్ట్రిక్  బస్సులను సైతం నడపాలని ప్లాన్  చేస్తున్నది తెలంగాణ ఆర్టీసీ. సంక్రాంతి ఆపరేషన్స్  ఆర్టీసీకి ఎంతో కీలకం.  ఈ దిశగా పూర్తి సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారుల‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది.


హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్  అడ్రస్  సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్  టాయిలెట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.