TGSRTC Special busses for devotees to attend Ujjaini mahankali secunderabad bonalu: తెలంగాణలో బోనాల పండుగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఆషాడ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని చెప్తుంటారు. ఈ క్రమంలోనే బోనాలను నిర్వహిస్తారు. ఇప్పటికే హైదరాబాద్ లోని గోల్కొండ అమ్మవారికి తొలిబోనం సమర్పణ కార్యక్రమం జరిగింది. అదే విధంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, బోనాలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో..ప్రస్తుతం ఓల్డ్ సిటీ బోనాలతో పాటు, సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవార్ల బోనాలు జరగనున్నాయి. హైదరాబాద్ లో సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఎంతోఫెమస్ అనిచెప్పుకొవచ్చు. ఇక్కడి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. బావిలో నుంచి అమ్మవారు భక్తుల కోసం ఉద్భవించారని చెప్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా


ఉజ్జయినిలోని అప్పయ్య అనే భక్తుడు ఉజ్జయినీలో  మొక్కుకొవడం వల్ల అక్కడ కలరాతగ్గిపొతుంది. దీంతో అతను సికింద్రాబాద్ లోని లష్కర్ ప్రాంతంలో గుడినికట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత బావిని తవ్వగా అమ్మవారి విగ్రహం బైటకు వస్తుంది. దీంతో అప్పటి నుంచి ఇక్కడ మందిరం నిర్మించి వందల ఏళ్ల నుంచి బోనాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు భక్తులకు కొంగు బంగారమని, పిలిస్తే పలికే దైవమని కూడా చెబుతుంటారు. అందుకే ఉజ్జయినీ మహంకాలి బోనాలుచూడటానికి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు.


సికింద్రాబాద్ లో రెండు రోజుల పాటు బోనాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే బోనాలు, రంగం, తోట్లేవేడుకలు. పోతరాజు, శివసత్తుల విన్యాసాలు భక్తుల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అమ్మవారిని అంబారీ మీద ఊరేగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. టీజీఆర్టీసీ సైతం.. సికింద్రాబాద్ ఉజ్జయినీ ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు ప్రకటించింది.


Read more: Crows: చికెన్ షాపు మీద యుద్ధం ప్రకటించిన కాకులు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో ఇదే..


నగరం నలుమూలల నుంచి రెండు రోజుల పాటు.. దాదాపు 175 స్పెషల్ బస్సులు నడుస్తాయని టీజీఆర్టీసీ అధికారులు ఒకప్రకటలో వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు తెలంగాణ సర్కారు బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, సికింద్రాబాద్ బోనాలకు నగరం అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు నడిపిస్తుండటం పట్ల భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 21, 22 తేదీలల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, అమ్మవారి భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొవాలని కూడా ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి