KCR Rajaiah Meet: కేసీఆర్‌కు బిగ్ బూస్ట్.. బీఆర్ఎస్లో తిరిగి చేరిన తాటికొండ రాజయ్య
Thatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
KCR Rajaiah Meet: అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ నిరాకరించడంతో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తిరిగి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు స్టేషన్ ఘన్‌పూర్ ఇన్‌చార్జ్‌గా రాజయ్యను కేసీఆర్ నియమించారు.
Also Read: Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలనం.. రేవంత్ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానం
ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ కేసీఆర్‌తో తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జరిగిన పరిణామాలను మరచిపోయి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన రాజయ్యను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వచ్చిన రాజయ్యకు కేసీఆర్‌కు వెంటనే బృహత్తర బాధ్యతలు అప్పగించారు. వరంగల్ ఎంపీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని రాజయ్యకు కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించారు. 'వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలి' అని చెప్పి రాజయ్యకు సొంత నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు.
మొన్నటి వరకు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంపీ టికెట్ తన కూతురు కడియం కావ్యకు ఇప్పించుకున్న అనంతరం అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ సరికొత్త వ్యూహం రచించారు. సిట్టింగ్ స్థానం వరంగల్‌ను తిరిగి నిలబెట్టుకునేందకు ఉన్న అవకాశాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజయ్యను తిరిగి పిలిపించుకున్నారు. పిలిపించుకోవడమే కాకుండా స్టేషన్ ఘన్‌పూర్ బాధ్యతలు కూడా ఇవ్వడం విశేషం. రాజయ్య రాకను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. కడియం శ్రీహరి చేసిన ద్రోహం.. మోసానికి రాజయ్య విరుగుడుగా అభివర్ణిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter