Hyderabad Pubs: బడా నేతతో అండతో పబ్ లో మైనర్ల పార్టీ? గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా పోలీసులు మారరా!
Hyderabad Pubs: పరువు పోతున్నా హైదరాబాద్ పోలీసుల తీరు మారదా? అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా నిర్లక్ష్యం వీడటం లేదా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Hyderabad Pubs: పరువు పోతున్నా హైదరాబాద్ పోలీసుల తీరు మారదా? అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా నిర్లక్ష్యం వీడటం లేదా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. హైదరాబాద్ పోలీసులకు మచ్చగా మిగిలింది. ఈ ఘటన మరవకముందే మరో పబ్ లో మైనర్ల పార్టీ జరగడం కలకలం రేపుతోంది.
జూబ్లీహిల్స్ అమేమ్నిషియా పబ్ తరహాలోనే సైబరాబాద్ లోని ఓ పబ్ లో మైనర్ల పార్టీ జరిగింది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ పబ్ లో రెండు రోజులు పాటు మైనర్లు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. మైనర్ల పార్టీకి మొదట అనుమతి నిరాకరించింది ఎక్సైజ్ శాఖ. అయితే ఓ బడా రాజకీయ నేత ఒత్తిడి తేవడంతో పబ్ లో మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. పబ్ పార్టీకి ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్లను పార్టీకి ఆహ్వానించారు యువకులు. సైబర్ హవర్స్ వాల్యూమ్ 11 పేరుతో ఈ పబ్ పార్టీ నిర్వహించారు. అయితే పార్టీలో మైనర్లకు లిక్కర్ సరఫరా చేయలేదని పబ్ యాజమాన్యం తెలిపింది.
అమ్నేషియా గ్యాంగ్ రేప్ ఘటన జరిగినా పబ్ లో పార్టీలకు అదికూడా మైనర్ల పార్టీకి అనుమతి ఇవ్వడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో పబ్ లను నిషేదించాలనే డిమాండ్ వస్తోంది. అయినా పోలీసుల తీరు మారలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీస్ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే పబ్ పార్టీలు జరుగుతున్నాయని.. మామూళ్ల మత్తులో ఖాకీలు చూసిచూడనట్లుగా వదిలేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. మైనర్ల పార్టీకి అనుమతి ఇచ్చిన ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
Read also: Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు..ఫోర్త్ వేవ్ వచ్చేసినట్టేనా?
Read also: AP Schools Reopening: 2022-23 అకడమిక్ కేలండర్ విడుదల.. జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి