Theft at  Ex MP Renuka Chowdhury's house: హైదరాబాద్‌: తెలంగాణ హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చోరీ (Theft) కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ( Renuka Chowdhury ) నివాసంలో చోరీ జరిగింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో చోరీ జరిగింది. రూ. 3 లక్షల రూపాయల నగదు, మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు రేణుకా చౌదరి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ (Banjara Hills Police Station) లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read; Indian Railways: పండగల కోసం 40 ప్రత్యేక రైళ్లు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు రేణుకా చౌదరి పోలీసులకు తెలిపారు. ఇంట్లో పని చేసేవారందరినీ విచారించిన తర్వాతే ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రేణుకా చౌదరి ఫిర్యాదు మేరకు.. బయటి వ్యక్తులు చోరి చేశారా, లేక ఇంట్లో పని చేసేవాళ్లే చోరీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు రేణుక చౌదరి నివాసంతోపాటు స్థానిక సీసీటీవి ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.  


ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe