ఈ పండగ సీజన్లో మీరు ట్రైన్లో ప్రయాణించాలి అనుకుంటే మీకు శుభవార్త. నార్తెన్ రైల్వేస్ ( Northern Railways ) 40 ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్టు తెలిపింది. రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రత్యేక ట్రైన్లను నడపనుంది తెలిపింది. అక్టోబర్ 15 నుంచి ఈ ప్రత్యేక ట్రైన్లు నడవనున్నట్టు నార్తెన్ రైల్వేస్ అధికారిక ప్రతినిధి దీపత్ కుమార్ తెలిపింది. ఆ కొత్త రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
ఈ నెలలో నడవనున్న ప్రత్యేక ట్రైన్లు....
- హజ్రత్ నిజాముద్దిన్- పుణె ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ ప్రుత్యేక ట్రైన్
- న్యూ ఢిల్లీ - కల్క శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రత్యేక ట్రైన్
- న్యూ ఢిల్లీ - డెహ్రడూన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్పెషల్
- శ్రీ మాతా వైష్ణో దేవీ కత్రా- న్యూ ఢిల్లీ ఏసి ఎక్స్ ప్రెస్ స్పెషల్
ముంబైకి ప్రత్యేక ట్రైన్లు
వీటితో పాటు ఈ ప్రత్యేక ట్రైన్లు నడవనున్నాయి. సమాచారం ప్రకారం బాంద్రా టెర్మినస్- హజ్రత్ నిజాముద్దిన్ యూత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు అక్టోబర్ 16 నుంచి నడవనుంది. హజ్రత్ నిజాముద్దిన్- బాంద్రా టెర్మినస్ ఎక్స్ ప్రెస రైలును అక్టోబర్ 17 నుంచి నడవనుంది.
o Read | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు
కరోనావల్ల (Coronavirus ) మార్చి 25వ తేదీ నుంచి ప్యాసెంజర్, మెయిల్, ఎక్స్ ప్రెస్ ట్రైన్లను నిలిపివేసింది భారతీయ రైల్లే. తరువాత మే1వ తేదీ నుంచి వలస కార్మికుల ప్రయాణం కోసం కొన్ని ట్రైన్లను ప్రారంభించారు. మే 12, 15 నుంచి ప్రత్యేక ఏసీ ట్రైన్లను షురూ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి 100 ట్రైన్లను అదనంగా మొదలు పెట్టారు. అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరో 80 ట్రైన్లను ప్రారంభించారు.
కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా తక్కువ సంఖ్యలో ట్రైన్లను నడుపుతోంది భారతీయ రైల్వేస్ ( Indian Railways ) . ప్రయాణికులు కూడా కోవిడ్-19 నియమ, నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR