Thief Sleeping in Kamareddy: అతను ఓ ఇంట్లో దొంగతనానికి దూరాడు. బంగారు నగలు అన్నీ సర్దుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నిద్ర ముంచుకువచ్చింది. కాసేపు పడుకుని వెళ్లిపోదామని అనుకున్నాడో ఏమో.. అక్కడే ఓ కునుకు తీశాడు. చివరికి అలానే నిద్రపోయాడు. ఆ ఇంటి సభ్యులు కూడా గుర్తించకుండా తాళం వేసి తమ పనులకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి దొంగను గుర్తించి పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిట్లం మండ‌లం ధర్మారానికి చెందిన బాచుప‌ల్లి శంకర్ అనే దొంగ అదే గ్రామంలో బంజ‌ హన్మంతప్ప ఇంట్లోకి దొంగతనం చేసేందుకు వచ్చాడు. అయితే ముందుగానే ఫుల్‌గా మద్యం తాగి చోరీకి వచ్చాడు. శంకర్ ఇంట్లో ఉన్న బంగారం అంతా సర్దుకున్నాడు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు మద్యం మత్తులో నిద్రరావడంతో అక్కడే పత్తిపై నిద్రపోయాడు. ఆ తరువాత రోజు ఉదయం హ‌న్మంత‌ప్ప ఇంట్లో పనులు చేసి.. పొలం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో శంకర్ ఇంట్లోనే ఉండిపోయాడు.


సాయంత్రం పొలం పనులు ముగించుకుని హన్మంతప్ప ఇంటి వచ్చి తలుపులు తీయగా.. శంకర్‌ను చూసి షాక్ అయ్యారు. చుట్టు పక్కల వారి సాయంతో దొంగను అక్కడే తాడుతో కట్టేశారు. ఎందుకు ఇంట్లోకి దూరవని అడగ్గా.. మద్యం మత్తులో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. అత‌డి దగ్గర బంగారం స్వాధీనం చేసుకుని.. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడి శంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా.. శంకర్‌పై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు తెలిసింది.


గతంలో తూ.గో.జిల్లాలో..


గతంలో ఇలాంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ కోసం వచ్చిన దొంగ.. నిద్ర రావడంతో అదే ఇంట్లోనే మంచం కింద గురకపెట్టి  నిద్రపోయి దొరికిపోయాడు. గోకవరంలో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తున్న సత్తి వెంకటరెడ్డి ఇంట్లో దొంగతనానికి దూరిన దొంగ.. యజమాని మేల్కొవడంతో అక్కడే మంచం కింద కాసేపు కునుకు తీద్దామని నిద్రపోయాడు. కాసేటికి గాఢ నిద్రలోకి జారుకుని గురక పెట్టాడు. పెద్ద సౌండ్‌ రావడంతో వెంకటరెడ్డి గమనించి.. బయటకు వచ్చి గదికి గడియ పెట్టాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 


పోలీసులు ఘటన స్థలానికి వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నాడు. అతని మొఖానికి ఉన్న మాస్క్ తీయగా.. వెంకటరెడ్డి షాక్‌కు గురయ్యాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. అతనికి బాగా పరిచయం ఉన్న సూరిబాబు అని తేలింది. తనకు డబ్బు బాగా అవసరం ఉండడంతో దొంగతనానికి వచ్చినట్లు నిందితుడు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. 


Also Read: Post Office Scheme: పోస్టాఫీసు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం.. పూర్తి వివరాలు ఇవిగో..  


Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. స్తంభించిన టికెట్ వ్యవస్థ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి