Three Commits Suicide in Patancheru: హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బానూరులో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రేఖ(28), వాసుదేవ(27), సోనం (2) లుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్రమ సంబంధమే ఈ ఆత్మహత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసకు వదిన అయ్యే రేఖతో వాసుదేవకు అక్రమ సంబంధం ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయం నలుగురికి తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 


వాసుదేవ, రేఖ మొదట సోనంను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సోనం రేఖ కూతురిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 


Also Read: Munugode ByElection: మునుగోడుకు ఉపఎన్నిక లేనట్టేనా? కేసీఆర్ ప్లాన్ తుమ్మల చెప్పేశారుగా..!  


Also Read: Munugode By Election: మునుగోడు బైపోల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు.. పీకే రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా ఉంది..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook