లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి దుర్మరణం
అతివేగం మూడు నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ వ్యాన్ గంభీరావుపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొట్టింది.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులను గంభీరావుపేట మండల వాసులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి