Hyderabad: జూబ్లీహిల్స్‌లో మరో కారు బీభత్సం... ఆటో, రెండు బైక్స్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు...
Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన హ్యుండాయ్ క్రేటా కారు ఆటో, రెండు బైక్స్‌ను ఢీకొట్టింది.
Jubilee Hills Car Accident: హైదారాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే షకీల్ బంధువులకు చెందిన కారు బీభత్సం సృష్టించగా.. ఆ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన హ్యుండాయ్ క్రేటా కారు ఆటో, రెండు బైక్స్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 233 పాయింట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్ 'TS08 HJ 665'గా వెల్లడించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
10 రోజుల క్రితం ఇదే జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్‌తో ఉన్న కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు నుంచి రోడ్ నంబర్ 1/45 వైపు దూసుకొచ్చిన ఆ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్కడే బుడగలు విక్రయిస్తున్న మహిళల పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందింది. కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో ఈ ప్రమాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రమాదానికి తనకు ఎటువంటి సంబంధం లేదని.. అది తన బంధువుల కారు అని షకీల్ వెల్లడించారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో కారులో షకీల్ కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
Man Trapped: బ్యాంక్ లాకర్ గదిలో చిక్కుకుపోయిన వృద్ధుడు... 18 గంటల పాటు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook