Gutka packet found in tirumala laddu In khammam: తిరుమల లడ్డు వివాదం  ప్రస్తుతం ఏపీలో హీట్ ను పెంచుతుంది. భక్తులు తిరుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. నమ్మిన వారి కొంగు బంగారంగా ఆశీర్వదిస్తాడని నమ్ముంతుంటారు. ఇక తిరుమల లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. ఇక్కడకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా శ్రీవారి కోసం భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు.. ఇటీవల తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ప్రకటించిన విషయం .. ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై ఇప్పటికే ల్యాబ్ రిపోర్టును సైతం చంద్రబాబు బైటపెట్టారు. మరోవైపు దీనిపై కేంద్రం కూడా  ఆరా తీసింది. పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ఏకంగా ఈరోజు నుంచి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను సైతం ప్రారంభించారు.  అంతేకాకుండా..  దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలో తెలంగాణాలోని ఖమ్మంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 



పూర్తి వివరాలు..


ఖమ్మంలోని గొల్లగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.  గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోన్న దొంతు పద్మావతి అనే మహిళ.. సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. వచ్చేటప్పుడు బంధువుల కోసం, ఇంటిపక్కల ఉన్న వారికి ప్రసాదం ఇవ్వడానికి లడ్డులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. .ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీసింది. ఒక్కసారిగా షాక్ కు గురైంది. లడ్డులో గుట్కాప్కాకెట్ కన్పిచ్చింది. దీంతో సదరు మహిళ అవాక్కైంది. అత్యంత పవిత్రంగా భావించే లడ్డులో.. జీడిపప్పు, కిస్మిస్ , యాలకులు ఉంటాయని అనుకున్న మహిళ.. గుట్కాప్యాకెట్ ఉండటం చూసి నివ్వేరపోయింది.  


Read more: Pawan kalyan: తనకిష్టమైన ఆ ఫుడ్‌ను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష నియమాలు ఏంటో తెలుసా..?


వెంటనే ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది. దీనిపై హిందు సంఘాలు మండిపడుతున్నాయి.  ఒక వైపు ఆవునెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ రచ్చ కొనసాగుతుండగా.. పవిత్రమైన లడ్డును తయారు చేసే ప్రదేశంలో అంబర్ లు తినడం, అలా తింటూ కూడా లడ్డులు చేస్తారా.. అనిచాలా మంది మండిపడుతున్నారు.  ఇదంతా భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కొంత మంది చేస్తున్న కుట్ర అంటూ కూడా చాలా మంది ఫైర్ అవుతున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.