Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఆదివారం) నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు.
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. ఆయన దర్శనం కోసం ఎంతో పరితపిస్తుంటారు. మనదేశం నుంచి మాత్రేమే కాకుండా.. ప్రపంచదేశాల నుంచి సైతం స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వస్తుంటారు. అంతేకాకుండా.. తన మొక్కులు ఏడుకొండల వాడికి మొక్కులు తీర్చుకుంటారు. కొంత మంది తలనీలాలు ఇస్తే, మరికొందరు నిలువుదోపిడీ సైతం ఇచ్చే వాళ్లుంటారు.
అంతేకాకుండా.. తిరుమల లడ్డు అనేది శ్రీవారికి ఎంతో ప్రీతికరమైందని చెప్తుంటారు. వెంకటేశ్వర స్వామికి.. ఆయన తల్లి ఎంతో ఇష్టంగా లడ్డులను తినిపించేదంట. అందుకు కొండపై స్వామివారు శిలా రూపంలో వెలిసిన తర్వాత కూడా.. తిరుమల శ్రీవారికి ప్రతిరోజు తప్పకుండా లడ్డును నివేదిస్తుంటారు. తిరుపతికి వెళ్లినవారు లడ్డులు కొని, తమ వారికోసం తప్పకుండా తెచ్చుకుంటారు.
అలాంటి పవిత్రమైన తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు, చేపనూనె కలిశాయంటూ కూడా చంద్రబాబు..కూటమి ప్రభుత్వం 100 రోజుల పాటలో సమావేశంలో బాంబు పేల్చారు. దీంతో ఏపీలో మాత్రమే కాకుండా.. దేశంలో దీనిపై చర్చ ప్రారంభమైంది. జాతీయ మీడియాలో సైతం లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ అంశం ఎక్కువగా వార్తలలో నిలిచింది.
మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై , మాజీ సీఎంపై మండిపడ్డారు. చంద్రబాబుసర్కారు దీనిపై విచారణకు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. దేవదేవుడికి ఇంతటి అపచారం చేశారని కూడా మండిపడ్డారు. ఈ క్రమంలో వెంటకటేశ్వర స్వామి కోసం, ఏపీ ప్రజలు బాగు కోసం.. 11 రోజుల పాటు కఠిన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోను కూడా.. ప్రాయశ్చిత్తం చేయాలని కూడా ఇప్పటికే చంద్రబాబు అధికారుల్ని, ప్రజల్ని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన.. క్రమంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ చేశారు.
దీనిలో పవన్ కళ్యాణ్... 11 రోజుల పాటు పాదరక్షలు ధరించకుండా దీక్ష లో ఉండనున్నారు. గతంలో వారాహి అమ్మవారి దీక్ష లో ఉన్నప్పుడు పాటించిన నియమాల మాదిరిగానే.. ఇప్పుడు కూడా ఆయన ఎంతో భక్తితో దీక్ష ఉండనున్నట్లు తెలుస్తోంది. దీక్షలో ఉంటునే అధికారిక కార్యక్రమాలు యథాతథనంగా పవన్ హజరవుతారని కూడా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష లో కేవలం పాలు, ప్రూట్స్ మాత్రమే తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. కేవలం డ్రైఫ్రూట్స్ తో కూడా పవన్ ఒకేసారి ఫుడ్ ను తీసుకుంటారంట. మరోవైపు ఆయనకు ఇష్టమైన కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ఐటమ్స్ ను సైతం త్యాగం చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లి ఏడుకొండలవాడిని దర్శనం చేసుకొనున్నారు.