హైదరాబాద్: తెలంగాణ మహాకూటమిలో టీజేఎస్ చేరుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సీట్ల విషయంలో తమ ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచుతామని..మమ్మల్ని గౌరవించి తగినన్ని సీట్లు కేటాయిస్తే మహాకూటమితో కలిసి వెళ్తామని లేదంటే ఒంటరిపోరుకు సిద్ధమౌతామని కోదండరాం వివరణ ఇచ్చారు. తమ ముందు మూడో ఆప్ఫన్ అంటూ ఏదీ లేదని ..బీజేపీతో కలుస్తారనే ఊహాగానాలకు ఈ సందర్భంగా కోదండరాం తెరదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లీకులు టీఆర్ఎస్ కుట్రలో భాగం
ఈ సందర్భంగా టీజేఎస్ కు కేలవం 4 సీట్లు మాత్రమే ఇస్తారని వస్తున్న లీకులపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని.. మహాకూటమితో చర్చల్లో తమకు 8 సీట్లు వరకు ఇస్తామని చెప్పారని ..అయితే తాము అంతకంటే ఎక్కువ సీట్లు అడుగుతున్నందన తమ మధ్య చర్చలు అక్కడితో ఆగిపోయాయని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమకు న్యాయమైన సీట్లు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకుంటామన్నారు కోదండరాం.


రాహుల్ తో కోదండరాం భేటీ


కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు టీజేఎస్ చీఫ్ కోదండరాం రేపు సాయంత్ర ఢిల్లీ వెళ్లున్నారు. ఎల్లుండి ఉదయం 9:30కి ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంలో కోదండరాం టీజేఎస్ కోరుతున్న సీట్ల గురించి రాహుల్ ముందు ఉంచనున్నారు. టీజేఎస్ డిమాండ్ పై రాహుల్ గాంధీ ఏ మేరకు స్పందిస్తారు.. కోదండరాం పార్టీకి ఎన్నిసీట్లు కేటాయిస్తానే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.