Hyd Metro: కాసేపట్లో ప్రధాని మోదీ బహిరంగ సభ..ఆ స్టేషన్లలో మెట్రో ఆగదు..!
Hyd Metro: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ..హెచ్‌ఐసీసీలో సాగుతున్నాయి. ఈక్రమంలో ఇవాళ హైదరాబాద్‌లోని పరేడ్ గౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ జరగనుంది.
Hyd Metro: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ..హెచ్‌ఐసీసీలో సాగుతున్నాయి. ఈక్రమంలో ఇవాళ హైదరాబాద్‌లోని పరేడ్ గౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ జరగనుంది. రాష్ట్ర బీజేపీ నేతలు సభ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రధాని మోదీ టూర్ ఉండటంతో భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మెట్రోపై పడింది. ప్రధాని మోదీ సభ కారణంగా కొన్ని స్టేషన్లలో మెట్రో స్టాప్‌ను నిలిపివేశారు. ఈమేరకు మెట్రో అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్యారడైస్, పరేడ్ గ్రౌండ్స్, జేబీఎస్ మెట్రో స్టేషన్‌లను మూసివేయనున్నారు. ఇవాళ ఆ సమయాల్లో మెట్రో రైళ్లు ఆగవని అధికారులు స్పష్టం చేశారు.
కారిడార్-2లో జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్లు ..సికింద్రాబాద్ వెస్ట్, ఎంజీబీఎస్ మార్గాల్లో మాత్రమే తిరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని..తగు మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. కారిడార్-1లో మియాపూర్-ఎల్‌బీనగర్ మార్గంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఈమేరకు హైదరాబాద్ మెట్రో ఎండీ,సీఈవో కేవీబిరెడ్డి తెలిపారు.
Also read:Cook Yadamma: ప్రధాని మోడీ వంట మనిషి యాదమ్మకు అవమానం జరిగిందా? బీజేపీ సమావేశాల్లో అసలేం జరిగింది?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook