Cook Yadamma: ప్రధాని మోడీ వంట మనిషి యాదమ్మకు అవమానం జరిగిందా? బీజేపీ సమావేశాల్లో అసలేం జరిగింది?

Cook Yadamma: తెలంగాణ వంటకాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రుచి చూపించటానిరి కరీంనగర్ జిల్లాకు చెందిన వంట మనిషి యాదమ్మను తీసుకువచ్చారు బండి సంజయ్. అయితే ప్రధాని మోడీకి వంట కోసం వచ్చిన యాదమ్మకు బీజేపీ సమావేశాల దగ్గర అవమానం జరిగిందనే ప్రచారం జరిగింది.

Written by - Srisailam | Last Updated : Jul 3, 2022, 12:59 PM IST
  • బీజేపీ సమావేశాలకు వంట మనిషి యాదమ్మ
  • యాదమ్మకు అవమానం జరిగిందనే ప్రచారం
  • తనను ఎవరూ అడ్డుకోలేదన్న యాదమ్మ
Cook Yadamma: ప్రధాని మోడీ వంట మనిషి యాదమ్మకు అవమానం జరిగిందా? బీజేపీ సమావేశాల్లో అసలేం జరిగింది?

Cook Yadamma: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. రెండు రోజుల సమావేశాలకు దేశంలోని బీజేపీ ముఖ్య నేతలంతా వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, దాదాపు 50 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ అగ్ర నేతలు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. జాతీయ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోసం ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేశారు.

తెలంగాణ వంటకాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రుచి చూపించటానిరి కరీంనగర్ జిల్లాకు చెందిన వంట మనిషి యాదమ్మను తీసుకువచ్చారు బండి సంజయ్. అయితే ప్రధాని మోడీకి వంట కోసం వచ్చిన యాదమ్మకు బీజేపీ సమావేశాల దగ్గర అవమానం జరిగిందనే ప్రచారం జరిగింది. వంట మ‌నిషి యాద‌మ్మ బృందానికి పాస్‌లు ఇవ్వ‌కపోవడంతో హోటల్ గేట్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నారనే వార్తలు వచ్చాయి. పోలీసుల తీరుతో అవమానంగా ఫీలైన యాద‌మ్మ బృందం.. హెచ్ ఐసీసీ దగ్గర రోడ్డుపై ధర్నా చేసిందనే ప్రచారం సాగింది. యాదమ్మ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. తెలంగాణ వంట మనిషి యాదమ్మను బీజేపీ ఘోరంగా అవమానించిందని టీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. యాదమ్మకు అవమానం జరిగిందనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తెలంగాణ ఆతిథ్యం ఇదేనా బండి సంజయ్ అంటూ కొందరు పోస్టులు పెట్టారు.

బీజేపీ సమావేశాల దగ్గర తనకు అవమానం జరిగిందని జరుగుతున్న ప్రచారంపై వంట మనిషి యాదమ్మ స్పందించారు.సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తనను ఎవరూ అడ్డుకోలేదన్నారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులకు తన చేతితో వండి వడ్డించే అవకాశం రావడం అదృష్టమన్నారు. తన  జన్మ ధన్యమైందంటూ అనందబాష్పాలు రాల్చారు యాదమ్మ. తనకు ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్ కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.తనను హెచ్ఐసీసీలోకి అనుమతించ లేదని కొందరు తప్పుడు ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. తనను ఎవడూ అడ్డుకోలేదని, సాదరంగా ఆహ్వానించారని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశ పూర్వకంగా తనపై అసత్య వార్తలను వైరల్ చేశారని చెప్పారు. కొందరు యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని, తనకు వాళ్ళ కుట్రలు అర్థం కాలేదని  చెప్పారు. తాను హోటల్ దగ్గరకు రాగానే  బండి సంజయ్ కారు పంపారని... ఆయన మనుషులు తనను వెంటనే లోపలికి తీసికెళ్లి గొప్పగా చూసుకున్నారని యాదమ్మ తెలిపారు. లోపలికి వెళ్లగానే ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసి అవకాశం దక్కడం జీవితంలో మరిచిపోలేనని యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

Read also: Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు

Read also:  Kcr Shock: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కార్పొరేషన్ మేయర్    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News