తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం మరింత స్పీడు పెంచేందుకు జాతీయ నాయకులను ప్రచారంలోకి దింపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలివిడత ప్రచారాన్నినిర్వహించగా ప్రధాని మోడీ కూడా తెలంగాణలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొనున్నారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని సభకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన కమలనాథులు భారీగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ :
* ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉ.11: 50కి నిజామాబాద్‌కు చేరుకుంటారు
* మహ్యాహ్నం 12 గంటలకు నిజమాబాద్ బహిరంగ సభలో ప్రసంగం
* మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్ బహిరంగ సభకు హాజరు
*  సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు


ఈ పర్యటన అనంతరం డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. అమిత్ షా కూడా మరో రెండు సార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. ఈనెల 28న డిసెంబర్ 2న జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఎన్నికలు సమీపించడంతో మోడీ, అమిత్ షాతో పాటు పలువురు జాతీయ నేతలలో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణ  బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు