Hero Venkatesh Travels in RTC Bus : తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త దిశలో పయణిస్తూ.. ప్రయాణికులందరినీ ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ ఎండీగా.. (RTC MD) ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తకొత్త నిర్ణయాలతో సజ్జనార్ (TSRTC MD Sajjanar) ఆర్టీసీని ప్రగతిబాటలో నడిపిస్తున్నారు. ఇక బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానం, అలాగే ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చేయడం, కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయడం, వివాహ ఇతర శుభకార్యాలకు ఎలాంటి అడ్వాన్స్‌లు లేకుండానే బస్సులను అద్దెకు ఇవ్వడం వంటి అనేక సరికొత్త నిర్ణయాలను సజ్జనార్ తీసుకున్నారు. ఇక పండుగల సమయంలో అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే ఆర్టీసీకి లాభాలు చేకూర్చిన ఘనత కూడా సజ్జనార్‌‌దే.


ఇక సజ్జనార్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటూ ఆన్‌ ది స్పాట్‌లో వాటిని పరిష్కరించండంలో సజ్జనార్ ముందుంటారు. ఇటీవల ఒక యువతి అర్ధరాత్రి సమయంలో చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించారు. ఇలా ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించడంలోనే కాదు.. సెలబ్రెటీలతో ఆర్టీసీని ప్రమోషన్ చేయడంలో కూడా సజ్జనార్ ముందున్నారు. సెలబ్రెటీలను ఆర్టీసీ ప్రమోషన్స్‌లలో ఉపయోగించడంలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్‌‌కు సరిలేరు ఎవ్వరూ. ఈ నేపథ్యంలో అనేక సినిమా క్లిప్పింగ్స్‌ కూడా సజ్జనార్‌‌ షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఒక వీడియో మస్తు వైరల్ అవుతోంది. 


Also Read : Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?


దృశ్యం మూవీలో హీరో వెంకటేష్ (Hero Venkatesh) ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీన్‌కు... కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం అనే పాటను యాడ్‌ చేసి తయారు చేసిన వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే "కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది." అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు సజ్జనార్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్స్ అంతా పలు కామెంట్స్ చేస్తున్నారు. సార్ మీ ఆలోచనలే అద్భుతం అంటూ సజ్జనార్‌‌ను (Sajjanar) ప్రశంసిస్తున్నారు.



 


Also Read : Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.