మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావుకు లొంగుబాటు (Maoist leader Ganapathi Surrender)కు సిద్ధమయ్యాడని, లొంగిపోయేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. 74 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న గణపతి లొంగుబాటుపై తన కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లా సారంగపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు పీపుల్స్ వార్ గ్రూపుతో తన కెరీర్ ప్రారంభించారు. ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..! 
Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..


సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి 2018లో పదవి నుంచి తప్పుకున్నారు. వయసురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా కేంద్ర కార్యదర్శి పదవి వదులుకున్నారు. గణపతి తర్వాత కేంద్ర కార్యదర్శి పదవిని నంబాల కేశవరావు చేపట్టారు. అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వానికి విషయం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి రాగానే లొంగుబాటుకు గణపతి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్