హైదరాబాద్‌ : తెలంగాణలో నేడు కొత్తగా మరో 10 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,132 కి చేరింది. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 29 ​మంది మృతి చెందారు. 722 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ప్రస్తుతం 376 మందికి రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద​ర్‌ కొద్దిసేపటి క్రితం ఓ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : COVID-19 deaths : కరోనా మృతుల్లో వాళ్లే అధికం


ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివ్ వ్యక్తులతో నేరుగా కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి లేదా కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే కోవిడ్-19 టెస్ట్స్ నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు తెలిపారు. తెలంగాణలో సరైన సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడంలేదనే ఆరోపణలకు సమాధానంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 రోజులుగా ఒక్క కరోనా వైరస్‌ పాజిటివ్ కేసు కూడా నమోదు కాని 14 ఆరెంజ్ జోన్స్‌ని గ్రీన్ జోన్స్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. అలాగే మరో 3 రెడ్ జోన్స్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదని.. వాటిని కూడా ఆరెంజ్ జోన్స్‌గా మార్చాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. సోమవారం దీనిపై కేంద్రం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి ఈటల ఆశాభావం వ్యక్తంచేశారు.


తెలంగాణ కోవిడ్-19 నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలిన మహిళకు వైద్యులు విజయవంతంగా డెలివరీ చేశారని.. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని మంత్రి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..