COVID-19 Updates : కరోనాతో మరో ఐదుగురు మృతి
తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ( COVID-19 positive cases in Telangana ) మళ్లీ పెరుగుతోంది. గురువారం నాడు కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ( COVID-19 positive cases in Telangana ) మళ్లీ పెరుగుతోంది. గురువారం నాడు కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు ( 26 cases in GHMC ), రంగారెడ్డి జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు ( 2 positive cases in Ranga Reddy district ) ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 10 మందికి ( Migrant workers) కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,699కి చేరింది. వీరిలో వలసకూలీలు 99 మంది ఉన్నారు. కరోనావైరస్ కారణంగా గత 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 45కి చేరింది ( COVID-19 death toll in Telangana ). ( Read also : భార్యకు చెప్పకుండానే కరోనా రోగి అంత్యక్రియలు.. వివరణ ఇచ్చిన మంత్రి ఈటల )
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,036 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం తెలంగాణలో 618 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..