హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ 71 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive case ) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ (GHMC ) పరిధిలోనే అత్యధికంగా 38 కరోనా కేసులున్నాయి. మరో 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా సోకింది. జిల్లాల వారీగా చూసుకుంటే.. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ జిల్లాలో 6, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ నేటి హెల్త్ బులెటిన్‌‌లో స్పష్టంచేసింది. ( Read also : ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు, ఒకరి మృతి )


కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య ( Corona deaths ) 57కి చేరినట్టయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 650 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 120 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,284 మందికి చేరుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..