Revanth Reddy Comments On CM KCR: 2018 ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని తనను ఓడించారని.. కొడంగల్‌లో పోలీసుల సాయంతో కేసీఆర్ మళ్లీ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు పోలీసులు ఉంటే.. తనకు కాంగ్రెస్ సైనికులు ఉన్నారని అన్నారు. 'మీరే నా సైనికులు.. మీరే బలగం..' అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని.. తమన చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. రూ.4 వేలు పెన్షన్ ఎలా ఇస్తారని కేసీఆర్ అంటున్నారని.. నెల నెలా మొదటి తారీఖునే రూ.4 వేలు పెన్షన్ ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ మిత్తికి కూడా సరిపోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తాను ఎవరికీ లేదనుకుండా సాయం చేశానని.. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే చచ్చిన శవాన్ని కూడా వదలకుండా దోచుకెళ్లే రకమంటూ విమర్శించారు.


కొడంగల్ తనకు పుట్టినిల్లు లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పెద్దలు చెప్పారని.. అందుకే కొడంగల్ గడ్డ నుంచే బీఆర్‌ఎస్‌ను బొందపెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తెస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు పాడుబడ్డదని.. రంగారెడ్డి దిక్కులేనిది అయిందన్నారు. ఈ నెల 26న జరిగే చేవెళ్ల ప్రజా గర్జన సభకు తరలి రావాలన్నారు. అత్యధికంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.


Also Read: Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం  


Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి