Revanth Reddy: హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారిందా? యువకులు డ్రగ్స్ బానిసలవుతున్నారా? మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వస్తోంది. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలవమైంది. ఆ ఘటన వెలుగుచూసిన తర్వాత వరుసగా అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్​చల్ చేశారు. గంజాయి తాగిన యువకులు.. మత్తులో రెచ్చిపోయారు. పోలీసులపైనే తిరగబడ్డారు. ఏకంగా పోలీసు వాహనంపైకి ఎక్కి వీరంగం వేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓల్డ్ సిటీలో యువకుల వీరంగం ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. మత్తులో యువకులు పోలీసుల వాహనాన్నే ధ్వంసం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో జ‌రుగుతున్న దారుణాలపై పౌర సమాజం ఆలోచన చేయాలన్నారు రేవంత్ రెడ్డి.



మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో సోమవారం అర్థ‌రాత్రి కొందరు యువకులు రచ్చ చేశారు. గంజాయి సేవించి మ‌త్తులో రోడ్డుపై హంగామా చేశారు. అటుగా వచ్చిన పోలీసులపై వాద్వాదానికి దిగారు. పోలీసు వాహ‌నంపై ఎక్కి వీరంగం వేశారు. పోలీసులు వారించే ప్రయత్నం చేసినా మత్తులో మరింతగా రెచ్చిపోయారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాలపై దాడికి దిగారు. స్థానికుల సాయంతో యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు చితక్కొట్టారు. కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి మత్తులోనే యువకులు రచ్చ చేశారని చెబుతున్న పోలీసులు.. వాళ్లకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.


Read also: Sonu Sood On Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై సోను సూద్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?


Read also: CM KCR: కేసీఆర్ షాకింగ్ న్యూస్... మమత మీటింగ్ కు డుమ్మా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook