Telangana Politics: బీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్‌కు వచ్చేది ఎన్ని సీట్లంటే..!
Revanth Reddy Comments on Alliance with BRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదన్నారు.
Revanth Reddy Comments on Alliance with BRS: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తులపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాలు చెబుతుండగా.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఎంఐల మధ్య ఉందన్నారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
'తెలంగాణలో ఎన్నికల ప్రచారం మూడు పార్టీల మధ్య జరుగుతోంది. ప్రచారంలో ముగ్గురు ఉంటున్నారు. కానీ ఎన్నికల్లో ఇద్దరే అవుతున్నారు. ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 80 శాతం కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్ర అభివృద్ధి చాలా ఉంది. తెలంగాణ వస్తే ఏదో జరుగుతోందని అనుకున్నాం. తెలంగాణలో స్వేచ్ఛ లేదు. తెలంగాణలో ధర్మ గంట ఉందా..? ప్రజా దర్బార్ లేదు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు.. అందుకే మాకు 80 సీట్లు ఇస్తారని ఆశిస్తున్నా..' అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కేసీఆర్ 25 సీట్లకు దాటరని.. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వ్యవహారాలు వేరు.. రాష్ట్ర రాజకీయాలు వేరని అన్నారు. కేసీఆర్‌కు రహస్య ఆదర్శ పురుషుడు దావూద్ ఇబ్రహీం అని అన్నారు. బీజేపీతో కొట్లాడినట్లు కనిపిస్తూ.. కాంగ్రెస్‌ను మింగేస్తారని విమర్శించారు. అందుకే ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీ టాస్క్ కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. లక్ష కోట్ల దోపిడీ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని.. ఒక్క కేసు కేంద్రం పెట్టలేదని ఆరోపించారు.
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు కేసీఆర్ అనుకూలంగా మాట్లాడడంతో పొత్తులపై చర్చ మొదలైంది. అయితే ఈ పొత్తులు జాతీయ స్థాయిలోనే అందరూ కొందరు అంటుండగా.. రాష్ట్రంలో కూడా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయంటూ మరి కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్
Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి