Telangana Tenth Hindi Paper Leak: తెలంగాణ వరుస పేపర్ లీక్ ఘటనలు సంచలన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) లీకేజీ ఘటన ఆందోళన రేకిత్తిస్తుండగా.. తాజాగా టెన్త్ పరీక్షల నిర్వహణలో అధికారుల వైఫల్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవ్వగా.. వికారాబాద్ జిల్లా తాండూర్ గవర్నమెంట్ స్కూల్లో నుంచి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం హిందీ పరీక్ష జరుగుతుండగా.. ఎగ్జామ్ ప్రారంభమైన వెంటనే వరంగల్ జిల్లాలో క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్‌లో కనిపించినట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
కాగా తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు.. తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఇన్విజిలేటర్లు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చారు. తాండూర్ గవర్నమెంట్ స్కూల్లో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో మొత్తం 12 మంది ఇన్విజిలేటర్లు ఉండగా.. రూమ్ నెంబర్ 5లో రిలీవర్‌గా ఉన్న బండ్యప్ప ఉన్నారని చెప్పారు.
ఈ రూమ్‌లో అబ్సెంట్ అయిన విద్యార్థి క్వశ్చన్ పేపర్‌ను ఫోటో తీసినట్లు గుర్తించారు. మరో స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న సమ్మప్పకు వాట్సప్ ద్వారా పంపించారు. సమ్మప్ప నుంచి తెలుగు ప్రశ్నాపత్రం మరికొంత మందికి వెళ్లింది. వీరిద్దరిపై ఐపీసీ 409, మాల్ ప్రాక్టీస్ యాక్ట్ సెక్షన్ 5,10 కింద కేసులు నమోదు చేశారు.
టెన్త్ పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాప్‌లో బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. చీఫ్ సూపరింటెండెంట్ శివ కుమార్, డిపార్ట్‌మెంట్ అధికారి గోపాల్, ఇన్విజిలేటర్లు బండప్ప, సమ్మప్పలను సస్పెండ్ చేశారు. చట్టం 25/1997 సీఆర్పీసీ సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి