EX MP Ponguleti Srinivas Reddy News: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముందు జరిగిన విషయాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. నాలుగైదు నెలలుగా పొంగులేటితో చర్చలు జరిపామని.. కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారని అన్నారు. తనకు కష్టమైనా.. నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని.. అందుకే తామంతా ఇక్కడకు వచ్చామన్నారు. ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తన వంతు సాయంగా ఉండేందుకు 1500 బస్సులు సభ కోసం తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఒంటి కన్ను శివరాసనుడు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఏదీ లేకపోతే నడుచుకుంటూ అయినా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు.. మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు.. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు. సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.. బీఆర్ఎస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క కట్టుకో కేసీఆర్.. ఖమ్మం సభతో బీఆరెస్ పాలనకు సమాధి కడుతాం..


మా సీనన్న మూడో కన్నులాంటివాడు.. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో.. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే.. పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసి ముందుకు సాగుతాం.. ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపించండి.. రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మాది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి  సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దాం.. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం.. గిరిజనులపై కేసులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ పోడు పట్టాలు ఇస్తుండు. కాంగ్రెస్ పోరాట ఫలితమే పోడు భూములకు పట్టాలు. ఖమ్మంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తుండు.." అని రేవంత్ రెడ్డి తెలిపారు. 


ఎప్పుడు సచివాలయానికి రాని కేసీఆర్‌ను ప్రజల బాట పట్టించామన్నారు. ఎలక్షన్ శాంపిల్ కోసమే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తున్నారని అన్నారు. అసలు ఈ ప్రభుత్వమే శాంపిల్ ప్రభుత్వన్నారు. వాళ్లు టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళుతున్నాడని కేటీఆర్ అంటున్నాడని.. ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా మీ అయ్య టీడీపీని వీడిందని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.


Also Read: Rajanna Sircilla Family Death: సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య  


Also Read: Narayana & Co Review: కామెడీ ఎంటర్‌టైనర్ నారాయణ & కో మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి