Congress Vijaya Bheri Sabha: ఈ నెల 17న తుక్కుగూడాలో నిర్వహించే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఏర్పాట్లు, ఇతర అంశాలపై నేతలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. విజయ భేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ను డిఫెన్స్ అధికారులను అడిగామని.. కానీ బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కిషన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారన్నారని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంను అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించిందని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడాలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నామని.. కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో అనుమతి నిరాకరించారని తెలిపారు. కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్‌ఎస్ పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి కాంగ్రెస్ సభకు భూములు ఇచ్చారన్నారు.


"తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇచ్చిన నాయకురాలు సోనియా వస్తుంటే.. ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాల్సింది. దురదృష్టవశాత్తు విజ్ఞత, విజ్ఞానం కేసీఆర్‌కు లేవు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన ఆయనకు లేదు. సీడబ్ల్యూసీ సమావేశాలకు మేం ఒక హోటల్ మాట్లాడుకుంటే.. కేటీఆర్ ఆ హోటల్ వాళ్లను బెదిరించి కాంగ్రెస్‌కు ఇవ్వొద్దని చెప్పారు. ఇవేం చిల్లర రాజకీయాలు.. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది. అధికారం ఉందని అణచివేసమని కేసీఆర్ అనుకుంటే.. ఆ ఆటలు ఇక సాగవు. 


ఈ నెల 16న తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుంది. సీడబ్ల్యూసీలో దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు ఉంటాయి. ఖమ్మం సభకు ఎన్ని ఆటంకాలు కలిగించిన ఎలా విజయవంతం చేశారో.. ఆ సభ స్ఫూర్తిగా ఈ విజయ భేరి సభకు లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు తరలిరావాలి" అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభను అడ్డుకోలేరు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  


Also Read: Chandrababu Arrest Latest Updates: చంద్రబాబే ప్రధాన కుట్రదారు.. పదేళ్ల జైలు శిక్షకు అవకాశం: ఏపీ సీఐడీ చీఫ్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి