ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 25 నుంచి వచ్చె నెల 4 వరకు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి.
హైదరాబాద్: గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 25 నుంచి వచ్చె నెల 4 వరకు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ ఆంక్షలు...
* రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వెళ్లే వాహనాలకు నిరాంకరి వైపు మళ్లీస్తారు.
* ఖైరతాబాద్ మార్కట్ వైపు నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు లైబ్రరీ వెనుక ఉండే ఎంసీహెచ్ శానిటరీ వార్డు ఆఫీస్ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
* మిస్ట్ కంపౌండ్ లైన్ నుంచి నక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ ప్రింటింగ్ ప్రెస్ వైపు మళ్లిస్తారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. వాహన దారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి కోరారు.