Traffic Restrictions: తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తవుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఒకరోజు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుంది. జూన్‌ 2వ తేదీన హైదరాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతుండడంతో వాటికి రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు గురువారం దారి మళ్లింపులు చేపట్టారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR At Charminar: రాజముద్ర మార్పుపై కేటీఆర్‌ ఆందోళన.. చార్మినార్‌ వద్ద భారీ నిరసన


 


అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ తదితర ప్రాంతాల్లో వేడుకల సన్నాహా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రిహార్సల్స్‌ జరుగుతున్న మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: KTR At Charminar: రాజముద్ర మార్పుపై కేటీఆర్‌ ఆందోళన.. చార్మినార్‌ వద్ద భారీ నిరసన


 


ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..


1. సమయం: ఉదయం 9 నుంచి 10: గన్‌పార్క్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. నాంపల్లి టీ జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు రాకుండా బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం వైపు మళ్లిస్తాయి.
2. సమయం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంపై ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయి. వీవీఐపీల వాహనాల రాకపోకలు ఉంటాయి. దీంతో వారి వాహనాలు వెళ్లాక సాధారణ వాహనదారులను అనుమతించనున్నారు. సీటీఓ, ప్లాజా జంక్షన్‌లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
3. సమయం: సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు హుస్సేన్‌నగర్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ట్యాంక్‌బండ్‌పై నుంచి సికింద్రాబాద్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. రాణిగంజ్‌, కర్బాలా ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను అనుమతించరు. వారిని బైబిల్‌ హౌస్‌, కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు దారి మళ్లిస్తారు.


రద్దీ ప్రాంతాలు కాకుండా..
ఈ ఆంక్షలు అమలు చేస్తూనే ట్రాఫిక్‌ పోలీసులు మరికొన్ని కీలక సూచనలు చేశారు. అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్‌ సిగ్నళ్లకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఆ కూడళ్ల నుంచి కాకుండా వేరే మార్గాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ రద్దీ నుంచి తప్పించుకుంటారని విజ్ఞప్తి చేశారు. రవీంద్ర భారతి, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, ఇక్బాల్‌ మీనార్‌, తెలుగుతల్లి జంక్షన్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, అంబేడ్కర్‌ విగ్రహం, కర్బాలా జంక్షన్‌, బైబిల్‌ హౌస్‌, సీటీఓ జంక్షన్‌, ప్లాజా జంక్షన్‌, ఎస్‌బీఐ జంక్షన్‌, టివోలి జంక్షన్‌ వంటి కూడళ్ల వైపు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలను గమనించి నగర పౌరులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దారి మళ్లింపులు ముందే తెలుసుకుని సురక్షితంగా మీ గమ్య స్థానాలకు చేరుకోవాలని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి